శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు..
తిరుమల (CLiC2NEWS): వచ్చే నెల (నవంబరు) నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రకటించింది. సర్వదర్శనం టికెట్లు పదివేలు, ప్రత్యేక దర్శన టికెట్ల 12 వేలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
నవంబరు నెలకు ప్ర్యతేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను టిటిడి ఖరారు చేసింది.
- అక్టోబరు 22వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్వన టికెట్లు
- అక్టోబరు 22వ తేదీన ఉదయం 10 వేల సర్వదర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.