బీహార్‌లో రోడ్డు మాయం..
ఇలావేశారు.. అలా ఎత్తుకెళ్లారు!

జహనాబాద్ (CLiC2NEWS): బీహార్‌లోని ఓ గ్రామంలో రోడ్డును ఎత్తుకెళ్లారు.. మీరు చదువుతున్నది నిజమే.. జహనాబాద్‌లో సిమెంటు రోడ్డునే గ్రామస్థులు లూటీ చేశారు. ఇటు కార్మికులు రోడ్డు వేస్తూ వెళ్లారు.. మరో వైపు గ్రామస్థులు ఆ తడి కాంక్రిట్టును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన విడియోలు ఇప్పుడు నెట్టింట్ల వైరల్ అయ్యాయి.
జహనాబాద్ జిల్లా ఔదాన్ గ్రామంలో ముఖ్యమంత్రి సడక్ యోజన కింద కొత్తగా రోడ్ల నిర్మాణం చెపట్టారు. సిమెంట్‌తో రోడ్డు వేశాక అక్కడికి వచ్చిన గ్రామస్థులు కొందరు రోడ్డును తవ్వుకుంటూ తడి కాంక్రీటును గంపల్లో ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.