ఆర్‌టిసి బిల్లు: గవర్నర్‌తో ముగిసిన కార్మికుల చర్చలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/rtc-employees-at-rajbhavan.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఆర్‌టిసి బిల్లును గవర్నర్ ఆమోదించాలని ఆర్‌టిసి కార్మికులు రాజ్‌భవన్ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు బస్సులు బంద్ చేసిన విషయం తెలిసిందే. బస్సు డిపోల వద్ద 2 గంటల పాటు బంద్ పాటించిన ఆర్‌టిసి ఉద్యోగులు తర్వాత నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం, రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఆర్‌టిసి యూనియన్ నాయకులతో గవర్నర్ పుదుచ్చేరి నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 10 మంది సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్ సానుకూలంగా స్పందించారని యూనియన్ సంఘం నేత థామస్ రెడ్డి తెలిపారు.
ఆర్‌టిసి కార్మికుల నిరసనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. బంద్ తర్వాత కూడా బస్సు సర్వీసులను పరిమిత స్థాయిలోనే ప్రారంభించినట్లు తెలుస్తోంది.
[…] […]