పార్లమెంట్ ప్రాంగణంలో ప్రదర్శించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం

ఢిల్లీ (CLiC2NEWS): బాలీవుడ్ దర్శకుడు ధీరజ్‌సర్నా తెరకెక్కించిన చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ చిత్రాన్ని సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రదర్శించారు. 2002 లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ యావత్ దేశాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు దుండగులు నిప్పు పెట్టగా.. ఆ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని ఆధారంగా చేసుకుని దర్శకుడు ‘ది సబర్మతి రిపోర్ట్’ను తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశిఖన్నా నటించిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది.
ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన విక్రాంత్ మాస్సే.. పార్లమెంట్‌లైబ్రరీలో ప్రదర్శించిన చిత్రంను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదో ప్రత్యేక అనుభూతి అని.. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎంపిలతో కలిసి సినమా వీక్షించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించిన రాశిఖన్నా మాట్లాడుతూ..ఇప్పటివరకు ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా, ఈరోజు ఇక్కడ వీక్షించడం చాలా స్పెషల్ అన్నారు.