బాపట్ల జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు గాయాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/school-bus-met-with-an-accident.jpg)
బాపట్ల (CLiC2NEWS): జిల్లాలోని అమృతలూరు మండలంలో పాఠశాల నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తాపడింది. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవపు వేడుకలు ముగిసిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లే క్రమంలో .. స్కూల్ బస్సు వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో బోల్తాపడినట్లు తెలుస్తోంది.