చ‌ర్ల‌ప‌ల్లి నుండి బ‌య‌లుదేర‌నున్న ఆ రెండు రైళ్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ స్టేష‌న్ల నుండి బ‌య‌ల్దేరే రెండు రైళ్ల ప్రారంభ స్థానం చ‌ర్ల‌ప‌ల్లికి మార్చిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. చెన్నై సెంట్ర‌ల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ .. చెన్నై సెంట్ర‌ల్-చ‌ర్ల‌ప‌ల్లిగా మారింది. ఇది మార్చి 7నుండి అందుబాటులోకి వ‌చ్చింది. అదేవిధంగా హైద‌రాబాద్‌-చెన్నై సెంట్ర‌ల్ .. చ‌ర్ల‌ప‌ల్లి-చెన్నై సెంట్ర‌ల్‌గా మారింది. ఇది మార్చి 8 నుండి అమ‌ల్లోకి రానుంది. గోర‌ఖ్‌పూర్‌- సికింద్రాబాద్‌, సికింద్రాబాద్ – గోర‌ఖ్‌పూర్ రైళ్లు .. గోర‌ఖ్‌పుర్ – చ‌ర్ల‌ప‌ల్లి, చ‌ర్ల‌ప‌ల్లి – గోర‌ఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. ఈ రైళ్లు ఈ నెల 12, 13 తేదీల నుండి అమ‌లులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.