రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించనున్నారు.