మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు.. సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): విద్యా , ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని.. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా కాన్సర్ ఆస్పత్రిని గురువారం సిఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సి ఉందని.. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని.. ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తారని తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సిఎం కోరారు.