అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వమే తల్లిదండ్రులు..
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ఆనాథ పిల్లలను రాష్ట్ర బిడ్డలుగా గుర్తించి, బాధ్యతలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం సిపార్సు చేసింది. కొవిడ్ కారణంగా అనాథలుగా మిగిలిన వారిని ఆదుకునేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు నిర్ణయాలు తీసుకుంది. శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పిల్లల సంరక్షణ కోసం అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. ఈ సమావేశంలో కెటిఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆనాథలతో భిక్షాటనను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. వీరిని అడ్డుపెట్టుకుని ఎవరైనా ఎటువంటి వ్యాపారాలు చేస్తే వారిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సూచించింది.