కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ (CLiC2NEWS): కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వరంగల్ సభ అనంతరం బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్‌కు లేఖ రాసినట్లు.. తన అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశానని కవిత తెలిపారు. ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక ముగించుకొని అమెరికా నుండి తిరిగి వచ్చేలోపు లేఖ బహిర్గతం కావడంపై కవిత స్పందించారు. ఎమ్మెల్సీ కవిత.. బిఆర్ఎస్ పార్టి అధినేత కెసిఆర్ కు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
తమ పార్టీలో ఉన్న నాయకులు అనుకుంటున్న విషయాలే లేఖలో ప్రాస్తావించినట్లు కవిత తెలిపారు. కానీ, అంతర్గతంగా రాసిన లేఖ.. బహిర్గతం కావడం పార్టీలో ఉన్న అందరం ఆలోచించాల్సిన విషయమని అన్నారు. కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుందని.. కెసిఆర్ నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టి ముందుకెళ్తుందన్నారు.