తాలిబన్లు మాట తప్పారు: అఖిలపక్ష భేటీలో జైశంకర్
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్రమంత్రి జైశంకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అప్ఘాన్‌లో పరిస్థితిపై దేశంలోని పలు పార్టీల నేతలకు ఆయన వివరించారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని జైశకంర్ తెలిపారు. అఫ్ఘన్‌లో భారత ప్రభుత్వం చేపడుతున్న తరలింపు చర్యలపై.. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుధవారం మరో 35 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందంలో తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు.