కేంద్రం నుండి అదనపు రుణం పొందడానికి అర్హత సాధించిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వంకు రూ. 5,392కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి లభించింది. రెండో త్రైమాసికంలో ఏడు రాష్ట్రాలు మూలధన వ్యయ లక్ష్యం సాధించి కేంద్రం నుండి అనుమతి పొందాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, ఛత్తీస్గడ్ రాష్ట్రాలు అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన జాబితాలో ఉన్నవి. మిగతా రాష్ట్రాలు మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.