మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి సిఎం కొణిజేటి రోశయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాయి. శనివారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోశయ్య మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించనున్నారు. ఆదివారం కొంపల్లిలోని ఫాంహౌప్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.