ట్రాక్‌మ్యాన్ స‌మ‌య‌స్ఫూర్తి.. రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

హొన్న‌వ‌ర్ (CLiC2NEWS): రైల్వే ప‌ట్టాల‌పై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన ట్రాక్‌మ్యాన్.. అదే మార్గంలో వ‌స్తున్న రైలును ఆపేందుకు ఐదు నిమిషాల్లో అర కిలోమీట‌రు మేర ప‌రుగులు తీసి, రైలును నిలిపివేయించారు. రైల్వే అధికారులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కొంక‌ణ్ రైల్వే డివిజ‌న్‌లో కుమ్టా, హొన్న‌వ‌ర్ స్టేష‌న్‌ల మ‌ధ్య మ‌హాదేవ అనే ట్రాక్‌మ్యాన్ త‌నిఖీలు చేప‌ట్టాడు. ఈ క్ర‌మంలో ఓ చోట ప‌ట్టాల జాయింట్ వ‌ద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్న‌ట్లు గుర్తించాడు. అప్ప‌టికే ఆదే మార్గంలో తిరువ‌నంత‌పురం-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ వ‌స్తోంది. అప్ర‌మ‌త్త‌మైన మ‌హ‌దేవ‌.. ముందుగా కుమ్టా స్టేష‌న్‌కు స‌మాచారం అందించాడు. అప్ప‌టికే రైలు ఆ స్టేష‌న్ను దాటేయ‌డంతో నేరుగా లోకో పైల‌ట్‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నించాడు. అదీ విఫ‌లమైంది. దీంతో ఆల‌స్యం చేయ‌కుండా రైలును ఆపేందుకు ప‌ట్టాల వెంట ఎదురుగా ప‌రుగు తీశాడు. ఐదు నిమిషాల్లో అర కిలోమీట‌ర్ మే ప‌ర‌రిగెత్తి.. లోకోపైల‌ట్కు సిగ్న‌ల్ అందించి, స‌కాలంలో రైలును నిలిపివేయిండాడు. వంద‌లాది మంది ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోసం త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన మ‌హాదేవ‌ను ఉన్న‌తాధికారులు స‌త్క‌రించి, అభినందించారు. ప‌ట్టాల‌కు వెల్డింగ్ ప‌నులు పూర్త‌యిన అనంతరం రైలు తిరిగి బ‌య‌లుదేరింది.

Leave A Reply

Your email address will not be published.