రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం..

లఖ్‌నవూ (CLiC2NEWS): రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయింది. కొన్ని బోగీలు విడిపోగా .. రైలు కొంత దూరం వెళ్లిన తర్వాత అధికారులు గమనించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సియోహరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పుర్ రైల్వేగేట్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తున్న కిసాన్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 21 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ఎనిమిది కోచ్‌లు విడిపోగా.. రైలు ప్రయాణిస్తుంది. గమనించిన అధికారులు మిగతా కోచ్‌లను సియోహరా రైల్వేస్టేషన్‌కు తరలించారు. పెనుప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అదే మార్గంలో మరో రైలు వచ్చి ఉంటే ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.