28 ఏళ్లనాటి శిరోముండనం కేసు.. తీర్పు వెలువరించిన విశాఖ కోర్టు

విశాఖ (CLiC2NEWS): కోనసీమ జిల్లాలో 1996 డిసెంబర్ 29న చోటుచేసుకున్నఘటనపై విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. 28 ఏళ్ల కిందట సంచలనం రేసిన శిరోముండనం కేసులో మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా మరో ఆరుగురు నిందితులకు న్యాయంస్థానం శిక్ష విధించింది. వారికి 18 నెలలపాటు జైలు శిక్షతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు.