భర్త గుండెపోటుతో మృతి.. అంత్యక్రియలు ముగియగానే భార్య ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/CRIME-NEWS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అమెరికాలో సాప్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా.. అతని అంత్యక్రియలు మగియగానే భార్య ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నగరానికి చెందిన మనోజ్, సాహితీలు ఏడాది క్రితమే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మనోజ్ అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డాడు. పెళ్లి అనంతరం భార్యాభర్తలిద్దరూ అమెరికా వెళ్లారు. సాహితీ మే నెలలో తల్లిదండ్రలను చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. మే 20 తేదీన మనోజ్ గుండెపోటుకు గురియ్యాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మనోజ్ మృతదేహం 23వ తేదీన నగరంలోని వనస్థలి పురంలోని కుటుంబసభ్యులకు అప్పగించారు. 24న అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె గురువారం తల్లిదండ్రల ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. వెంటనే తల్లిదండ్రలు, సోదరి ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Incredible! This blog looks just like my old one! It’s on a entirely different topic but it has pretty much the same layout and design. Superb choice of colors!