తెలుగు రాష్ట్రాల్లో జూన్ నుండి థియేటర్లు బంద్..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు జూన్ 1 నుండి బంద్ చేయాలని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్‌రాజు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. వారికి పర్సంటేజ్‌లు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.
ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజ్‌లపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజ్, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించినట్లు సమాచారం.