శంషాబాద్ వెంకటేశ్వరాలయంలో చోరీ!

శంషాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజాపూర్వెం శ్రీబాలాజీకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని సిసి కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను తీసుకెళ్లారు. ఇవాళ (మంగళవారం) ఉదయం పూజారి ఆలయం వద్దకు చేరుకునే సరికి గుడి తెరిచి ఉంది. దాంతో పూజారి పోలీసులకు విషయం తెలిపారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘనపై కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాంలింపు చేపట్టారు.