సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 43.50 లక్షలు చోరీ..

సిద్దిపేట (CLiC2NEWS): పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దుండగులు కాల్పులు జరిపి రూ. 43.50 లక్షలు అపహరించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ రియల్టర్ కారు అద్దాలు పగుల గొట్టి డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదును అపహరించారు.
దొమ్మాట మాజీ సర్పంచ్, సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి నర్సయ్య, సిద్దిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీథర్ రెడ్డికి ఫ్లాట్ విక్రయించాడా. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ రాయించుకున్న అనంతరం నర్సయ్యకు శ్రీథర్ రెడ్డి రూ. 43.50 లక్షలు ఇచ్చాడు. అనగదును నర్సయ్య తన కారు డ్రైవర్ పరుశురామ్ కు అప్పగించాడు. ఆఫీసులోకి వెళ్లి సంతకాఉల చేసి వస్తానని, కారులోనే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇంతలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాన్ని పగుల గొట్టి , డ్రైవర్ పరశురామ్‌పై కాల్పులు జరిపారు. మరోవ్యక్తి అవతివైపు నుండి నగదు ఉన్న బ్యాగు తీసుకొని తుపాకీని అక్కడే వదిలేసి బైక్‌పై పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం లోని తుపాకీని బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు కంట్రీమేడ్ గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్థారించారు. పోలీసు కమీషనర్ శ్యేత అక్కడికి చేరుకొని పరశీలించారు. దుండగులను పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.