బ్యాంకుల నుండి మనీ విత్ డ్రాకు ఎలాంటి జిఎస్టి లేదు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ (CLiC2NEWS): బ్యాంకుల నుండి నగదు విత్ డ్రా చేసుకుంటే ఎటువంటి జిఎస్టి ఉండదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అదేవిధంగా వినియోగ దారుల చెక్‌బుక్‌లపై కూడా పన్న ఉండదని అన్నారు. బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపై మాత్రమే జిఎస్టి ఉంటుదని తెలిపారు. ముందుగా ప్యాకింగ్ చేసి లేబుల్ వేసిన ఆహార పదార్థాలపై 5% జిఎస్టి విధించామన్నారు. ఈ ప్రతిపాదనకు జిఎస్టి కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. ఆహార పదార్థాలు విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్న, ఆస్పత్రి బెడ్స్ — ఐసియులకు జిఎస్టి లేదన్నారు. రోజుకు రు. 5000 రెంట్ చెల్టించే రూమ్స్‌కు మాత్రమే జిఎస్టి విధించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.