తెలంగాణలో ఇకనుండి బెనిఫిట్ షోలు ఉండవు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): కొత్త సినిమా విడుదలకు ముందు రోజున థియేటర్లలో బెనిఫిట్ షో వేస్తారు. అయితే , ఇక నుండి ఎలాంటి బెనిఫిట్ షో లు ఉండవని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పుష్ప2 ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25లక్షలు సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తానన్న అల్లు అర్జున్ .. హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. బాలుడి వైద్య ఖర్చులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ వినలేదని.. శనివారం అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. థియేటర్ వద్దకు రావడానికి అనుమతి ఇవ్వకుండానే బన్నీ థియేటర్‌కు వచ్చారన్నారు. థియేటర్ యాజమాన్యం ఈ నెల 2వ తేదీన చిక్కడపల్లి పిఎస్‌లో దరఖాస్తు చేయగా.. అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినా సరే డిసెంబర్ 4 న అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్ వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.