రేపు ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య మూడో విడ‌త చ‌ర్చ‌లు..

ఉక్రెయిన్‌పై ర‌ష్యా సేన‌ల భీక‌ర దాడులు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఈ రెండు దేశాల మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతి కోసం తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే బెలార‌స్ వేదిక‌గా రెండు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌రిగినవి.

ర‌ష్యా అధ్య‌క్ష‌డుడు పుతిన్ శ‌నివారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్ గ‌గ‌న త‌లాన్ని నో-ప్లై జోన్ గా విధించిన ఏ దేశ‌మైనా ప్ర‌స్తుత వివాదంలోకి వ‌చ్చిన‌ట్లే భావిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఆ దేశాలు యుద్ధంలో పాల్పంచుకున్న‌ట్లుగా ప‌రిగ‌ణిస్తామ‌న్నారు. ర‌ష్యాతో యుద్ధానికి సిద్ధ‌ప‌డాల‌న్నారు. ర‌ష్యాపై విధిస్తున్న ఆంక్ష‌లు యుద్ధ ప్ర‌క‌ట‌న‌తో స‌మాన‌మ‌న్నారు.

 

Leave A Reply

Your email address will not be published.