తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల

అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు

తిరుమ‌ల‌ (CLiC2NEWS): తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌త్యేక ప్రవేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (తితిదే) విడుద‌ల చేసింది. సెప్టెంబర్ నెల‌కు గాను ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తితిదే మంగళవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
వాస్తవానికి కోటా ఈ నెల 20న విడుదల కావాల్సిన ఉండగా.. టికెట్ల విడుదల వాయిదా వేసింది. ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో వచ్చాయి. వచ్చే నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ‘tirupatibalaji.ap.gov.in’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 09గంటలకు టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

ప్రతినెలా చివరి వారంలో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే. స్వామివారి కల్యాణోత్సవం టిక్కెట్లు కలిగిన భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. కాగా భక్తుల రద్ధీ దృష్ట్యా ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. మరోవైపు, తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ‌త నెల వ‌ర‌కు 5 వేల టికెట్ల‌ను విడుద‌ల చేసిన తితిదే. సెప్టెంబ‌రు నెల‌కు సంబంధించి 8 వేల టికెట్ల‌ను భ‌క్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు టీటీడీ నిబంధనలతో పాటు, కోవిడ్ రూల్స్ కూడా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.