ఈ చట్నీతో కొలెస్ట్రాల్ కు చెక్‌!

శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాన్ని తగ్గించడానికి ఈ చట్నీ తయారు చేసుకోండి..

చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి…
మన శరీరం చక్కగా సమర్థవంతంగా పనిచేయటానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవసరం.. అయితే దానికి మించింది ఎక్కువ ఉంటే రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి… శరీరంలో ఉండవలసిన కొలెస్ట్రాల్ కంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్తంలో ఉంటే అది ధమని గోడలకు కట్టుబడి మరియు వాటిని సంకోచించవచ్చును లేదా నిరోధించవచ్చును. దీని ఫలితంగా కరోనరీ ఆర్టరి వ్యాధి ఇతర గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది.

చెడు కొలెస్ట్రాలను & ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడానికి చక్కని ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలి. పండ్లు తినాలి.. జ్యూస్ లు తాగాలి . మనం తినే ఆహారం మన శరీరంలో తయారయ్యే చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పై ప్రధాన భావాన్ని చూపుతుంది. కొలెస్ట్రాలు తో గుండెపోటు, స్ట్రోకులు వచ్చే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చక్కని ఒక చట్ని చెప్తాను. ఇది ఆహారంలో తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ని చక్కగా తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని చక్కగా తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి చట్ని.

చట్నీ తయారు చేసే విధానము

  • కావలసిన పదార్థాలు
  • పుదీనా 25 గ్రాములు
  • కొత్తిమీర 50 గ్రాములు
  • పచ్చిమిర్చి తగినంత
  • ఇసబగోల్ 15 గ్రాములు
  • వెల్లుల్లి 25 గ్రాములు
  • అవిసె గింజలు 20 గ్రాములు.
  • నిమ్మరసం 15 మిల్లి
  • ఉప్పు తగినంత
  • నీరు అవసరమైనంత

పైన చెప్పినవన్నీ పదార్థాలను మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయండి.

ఇది చక్కగా మన ఇడ్లీలో గాని ఏదైనా టిఫిన్ లో గాని చక్కగా తింటే ఆరోగ్యానికి మంచిది. జీర్ణ క్రియ కూడా త్వరగా చక్కగా జరుగుతుంది. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ తినటం ద్వారా చక్కగా ఆహారము రుచిగా ఉంటుంది. తిన్నది త్వరగా అరుగుతుంది. ఆరోగ్యానికి ఆనందానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆకలి లేకపోతే ఆకలి పుట్టిస్తుంది.

ఈ చ‌ట్నీ తాలింపు వేయొద్దు

-షేక్. బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.