అవినీతిని అంతమొందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే..
వరంగల్ (CLiC2NEWS): అవినీతిని అంతమొందిచాల్సిన పోలీసు అధికారి.. తానే అవినీతి సొమ్ముకు ఆశపడి అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సిఐ.. అక్టోబర్ 2 వ తేదీన దంతాలపల్లిమండల పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రావాణకు సంబంధించిన లారీని పట్టుకున్నారు. దీంతో సంబంధం ఉన్న ఐదుగురు ఖమ్మం జిల్లా వాసులను.. కొమురం భీం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. బియ్యం అక్రమ రవాణా కేసు విషయంలో వారితో సిఐ సంప్రదింపులు జరిపి రూ. 4లక్షలు డిమాండ్ చేవౄరు. అక్టోబర్ 3న తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు నగదు తీసుకున్నాడు. మిగతా రూ.2లక్షలు కోసం ఒత్తిడి చేయసాగాడు. అక్టోబర్ 25న ఆసిఫాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్ వరంగల్ ఎసిబిని ఆశ్రయించాడు. మిగిలిన రూ.2లక్షలు సోమవారం తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఇవ్వడానికి వెళ్లగా.. సిఐ డబ్బులు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అయినా.. వెంటనే సిఐని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అధికారుల సమక్షంలో సిఐ మొబైల్‌లొ మాట్లాడిన వివరాలను ధ్రువీకరించారు. దీంతో సిఐ ఇంటితో పాటు అతిని స్వగ్రామమైన కొత్తగూడెంలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ రోజు ఎసిబి కోర్టులో తొర్రూరు సిఐని హాజరుపరుస్తున్నట్లు సమాచారం.