యాదాద్రి స్వ‌ర్ణ‌తాప‌డం కోసం విరాళాల వెల్లువ

హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య విమానగోపురానికి బంగారు తాపడం చేయిస్తున్నామని ముఖ్య‌మంత్రి కెసిఆర్ వెల్లడించారు. మంగళవారం యాదాద్రి లో ప‌ర్య‌టించిన సిఎం కెసిఆర్‌.. సాయంత్రం అక్క‌డ మీడియాతో మాట్లాడారు… స్వామివారి గర్భగుడిపైన ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. దీనికోసం తిరుమలలో చేసిన వారిని మన అధికారులు సంప్రదించారు. దానికి వారు స్పందిస్తూ.. తమకు కొంత సమయం పడుతుందని చెప్పార‌ని పేర్కొనారు. దానికి వారు వేసిన బంగారం అంచనా. 125 కిలోలు అని సిఎం తెలిపారు.

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం సీఎం కేసీఆర్ తొలుత త‌న వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి ఆల‌యానికి ప‌లువురు ప్ర‌ముఖులు బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టిస్తున్నారు

బంగారం విరాళంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన వారు.

  1.  ముఖ్య‌మంత్రి కెసిఆర్ – 1.16 కేజీలు
  2. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – 6 కేజీలు
  3. ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు – 2 కేజీలు
  4. జ‌ల‌విహార్ రామ‌రాజు – 1 కేజీ
  5. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి – 5 కేజీలు
  6. మంత్రి మ‌ల్లారెడ్డి – 2 కేజీలు
  7. ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – 2 కేజీలు
  8. మంత్రి హ‌రీశ్‌రావు – 1 కేజీ
  9. న‌మ‌స్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు – 1 కేజీ
  10. కావేరీ సీడ్స్ భాస్క‌ర్ రావు – 1 కేజీ
  11. జీయ‌ర్ పీఠం – 1 కేజీ
  12. ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ – 1 కేజీ
  13. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కేజీ
  14. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కేజీ
  15. ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు – 1 కేజీ
  16. ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కేజీ
  17. ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కేజీ
  18. ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ – 1 కేజీ
  19. ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కేజీ
  20. క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ – 1 కేజీ
Leave A Reply

Your email address will not be published.