త్వరలో 35 వేల ఉద్యోగాల భర్తీ: సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు బర్తీ చేయనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని.. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మంది ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. సివిల్స్ అభయహస్తం పేరిట.. యుపిఎస్సి ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు రూ. లక్ష ఆర్ధిక సాయం చెక్కులను సిఎం అందజేశారు.
నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు సిఎం చెక్కులను అందజేశారు. ప్రిలిమ్స్‌లో రాష్ట్రానికి చెందిన 135 మంది అభ్యర్థులు .. మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరందరికీ రూ. లక్ష చొప్పున చెక్కులను సిఎం అందజేశారు. రాష్ట్రం నుండి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మెయిన్స్ ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి అర్హత సాధించిన వారికి కూడా రూ. 1లక్ష ఆర్దిక సాయం అందజేస్తామని సిఎం ప్రకటించారు.