హైదరాబాద్-దుబాయ్ ఫ్లైట్ హైజాక్ చేస్తామంటూ.. బెదిరింపు మెయిల్
శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్

శంషాబాద్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్-దుబాయ్ ఫ్లైట్‌ను హైజాక్ చేస్తామని మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. దీంతో అప్పమత్తమైన ఎయిర్‌ఫోర్టు సిబ్బంది.. బయల్లేరతున్న విమానాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం వినోద్, రాకేశ్, తిరుపతి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు దుబాయ్ మీదుగా ఇరాక్ వెళ్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. వీరిని పోలీసులకు అప్పగించారు. విమానాన్ని రద్దు చేసి.. ప్రయాణికులందరినీ వేరే విమానంలో దుబాయ్ పంపనన్నట్లు తెలిపారు.