సల్మాన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్..
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు దుండగుడు ఫోన్
ముంబయి (CLiC2NEWS): ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఏకంగా ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు దుండగుడు ఫోన్‌చేశాడు. 30వ తేదీ లోపు సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. రాకీ భాయ్ పేరుతో ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో.. ఎవరు చేశారో తెలియలేదు. పోలీసులు ఈ విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సల్మాన్‌కు ఇదివరకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 18వ తేదీన ఈ మెయిల్ ద్వారా సల్మాన్ ఆఫీస్‌కు బెదిరింపులు వచ్చాయిని ఆయన టీమ్ తెలిపారు. ఈ వరుస బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు సల్మాన్ భద్రతపై మరింత దృష్టి పెట్టారు.