మున్నేరు వాగులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/water-help.jpg)
ఖమ్మం (CLiC2NEWS): సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఖమ్ం జిల్లా రూరల్ మండలంలో గుదిమళ్ల సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. మరణించిన వారు లోకేశ్ , హరీశ్, గణేశ్‌గా పోలీసులు గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో అన్నదమ్ములు లోకేశ్, హరీశ్.. ఇంటిపక్కన ఉండే స్నేహితుడు గణశ్ తో కలిసి చేపల వేట, ఈత కోసం మున్నేరు నది వద్దకు వెళ్లారు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా ధంసలాపురం, గుదిమళ్ల గ్రామాల మధ్య మున్నేరు నదిలో గుంతలు తవ్వి వదిలేశారు. చిన్నారులు గుంతలో పడి.. అదిలోతుగా ఉండటంతో చిన్నారులు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గరి మృతదేహాలు లభ్యమయ్యాయి.