తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ్యం..

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో ముగ్గురు ఏడవ తరగతి చదివే విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల ఆర్బిసి సెంటర్‌కు చెందిన చంద్రశేఖర్, వైభవ్ యోగేశ్, శ్రీవరదన్ ముగ్గురు ఎస్‌వి హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్తున్నామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి చేరుకుని ల్యాప్‌ట్యాప్ తీసుకున్నారు. తర్వాత బస్సు ఎక్కి తిరుపతి ఏడు కొండల బస్టాండ్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుండి వారి ఆచూకీ తెలియటంలేదు. తమ పిల్లలు స్కూల్‌కి వెళ్లి తిరిగి రాలేదని భావిస్తున్న తల్లిదండ్రులు పాఠశాలలో ఆరా తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
[…] తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ… […]