విజయనగం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
టెక్కలి (CLiC2NEWS): విజయనగం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలి వలస వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బైక్‌పై ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, సమీప గ్రామంలోని జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు.