రాష్ట్రంలో మూడు రోజులు పాఠశాలలకు సెలవులు
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/rain-kcr-school.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రేపటి నుంచి మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధవారాలు) సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో రానున్న వర్షాల పరిస్థితులపై తీసుకోవల్సిన చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.