విహార యాత్రకు వెళ్లి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కోరుకొండ (CLiC2NEWS): విహార యాత్రకు వెళ్లిన విద్యార్థుల కారు కాలువలోకి దూసుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు విహారయాత్రకు కారులో బయలు దేరి వెళ్లారు. వీరంతా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత బూరుగుపూడి సమీపంలో పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలోకి దూసుకుపోయింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లిన విద్యార్ధులంతా ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చుదవుతున్నారు.