కనకదుర్గ అమ్మవారికి మూడు స్వర్ణ కిరీటాలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/swarna-kireetalu.jpg)
విజయవాడ (CLiC2NEWS): ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం 1,308 గ్రాముల బరువుతో మూడు బంగారు కిరీటాలను అందించారు. ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి. హరికృష్ణా రెడ్డి దంపతులు ఈ కానుకను ఆలయ ఈఓకు అందజేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశ్వీరచనం చేసి, తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.