ఆదిలాబాద్ లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ఆదిలాబాద్ (CLiC2NEWS): ఆదిలాబాద్ జిల్లా పిడుగులతో దద్దరిల్లింది‌. నిన్న‌టి నుండి తెల‌గాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు…. నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు.

  • జిల్లాలోని బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు.
  • అలాగే బండల్ నాగపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘ‌ట‌న‌లో మరో ముగ్గురు తీవ్రగాయాల‌పాల‌య్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
  • జిల్లాలోని బీమ్‌పూర్ మండలం పిప్పల్ కోటిలో పిడుగుపాటుకు ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది‌.
  • జైనథ్ మండలం సాంగ్వి కే గ్రామంలో పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతిచెందాయి.
Leave A Reply

Your email address will not be published.