ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ముగ్గురి మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైటెక్ సిటీ స‌మీపంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. రైలును గ‌మ‌నించ‌కుండా ప‌ట్టాలు దాటేందుకు ప్ర‌య‌త్నించిన రాజ‌ప్ప‌, శ్రీ‌ను, కృష్ణ రైలు ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతుల్లో ఒక‌రి వ‌ద్ద మ‌ద్యం సీసీలు ఉన్న‌ట్టు గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతులు వ‌న‌ప‌ర్తి వాసులుగా గుర్తించామ‌ని, వీరంతా సంక‌ల్స్ అపార్ట్‌మెంట్ స‌మీపంలో నివ‌సిస్తున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.