ప్ర‌కాశం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

ప్ర‌కాశం (CLiC2NEWS): ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు యువ‌కులు మృతి చెందారు. జిల్లాలోని నాగులుప్ప‌ల‌పాడు మండ‌లం ముద్దిరాల పాడు వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జరిగింది. ఈప్ర‌మాదంలో నాగులుప్ప‌ల‌పాడు మండ‌లంలోని పైడిపాడు కు చెందిన ముగ్గురు యుకులు ప్ర‌మాద స్థ‌లంలోని మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు వినాయ‌క విగ్ర‌హం కొనుగోలు కోసం ఒంగోలు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.