అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురి మృతి

న్యూయార్క్ (CLiC2NEWS): అమెరికాలోని హ్యూస్ట‌న్ మార్కెట్‌లో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని బ‌ఫెల్ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో రెండు ప్రాంతాల్లో కాల్పుల క‌ల‌క‌లం రేపుతున్నాయి. హ్యూస్ట‌న్‌లో ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెండు గ్రూపుల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ వాతావర‌ణ‌మే ఈ కాల్పుల‌కు దారి తీసింద‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. కాల్పుల‌కు పాల్ప‌డిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

మ‌రో ఘ‌ట‌న‌లో.. ద‌క్షిణ కాలిఫోర్నియాలో ఓ చ‌ర్చిలో జ‌రిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.