బాపట్ల జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురి మృతి

బాపట్ల (CLiC2NEWS): బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కర్లపాలెం మండలం యాజిలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నగరం మండలం గట్టువారి పాలెం గ్రామానికి చెందిన 20 మంది కొండపాటూరుకు మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాజలి పాఠశాల సమీపంలో ఆర్టీసీ బస్సును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాంలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం (40) ఘటనా స్థలంలోనే మరణించారు. గాయపడిన వారికి బాపట్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.