బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

చౌటుప్పల్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లా ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మృతుల్లో ఒకరు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన హరీశ్, ఇద్దరు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందినవారు. ఈ ముగ్గురు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు.
ఈ ముగ్గురు యువకులు శుక్రవారం హరీశ్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహకార్యక్రమానికి హాజరై హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసకుంది. అర్థరాత్రి 2.30 ప్రాంతంలో ధర్మోజీగూడెంలో ఉన్న వేబ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్ చేస్తుండగా వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.