ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి

రంగారెడ్డి(CLiC2NEWS): హైదరాబాద్‌ శివార్లలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై రావిరాల వద్ద ఆగిఉన్న లారీని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతిచెందారు… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘ‌ట‌న‌లో ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్ ను బ‌య‌ట‌కు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి క్లీనర్ ను బయటకు తీశారు . అనంత‌రం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.