రాయపర్తి ఎస్‌బిఐలో చోరీ చేసిన ముఠాలో ముగ్గురు అరెస్టు

రాయపర్తి (CLiC2NEWS): గత నెల 18న రాయపర్తి ఎస్‌బిఐలో 13.61 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రలోని ఎస్‌బిఐలో లాకర్‌ను కట్ చేసి దాదాపు 19 కేజీల బంగారం దుండగులు చోరీ చేశారు. బంగారాన్ని దోచుకున్న ముఠాలో ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సైతం అదుపులోకీ తీసుకున్నారు. నిందితులు ప్రయాణిస్తున్న వాహనం చెడిపోవడంతో తెల్లవారు జామున 5 గంటల నుండి హైదరాబాద్-వరంగల్ రహదారిపై 2 గంటలపాటు ఉండిపోయారు. దొంగల ముఠాలో ఒకరు రహదారిపై పెట్రోలింగ్‌లో ఉండే లిప్టింగ్ వాహనానికి ఫోన్‌చేసి మరమ్మతులు చేయించారు. ప్రధాన నిందితుడు మరో వాహనంలో వెళ్లిపోగా.. ముగ్గురు ముఠా సభ్యులు రెండు చోట్ల టోల్‌ప్లాజా వద్ద వేరే వేరే నంబర్ ప్లేట్‌లతో దాటి వెళ్లారు. మహారష్ట్ర మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 2.52 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.