కాకినాడ జిల్లాలో విద్యుత్ తీగ‌లు తాకి ముగ్గురు మృతి

జ‌గ్గంపేట (CLiC2NEWS): పామాయిల్ తోట‌లో క‌రెంటు తీగ‌లు త‌గిలి ముగ్గురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా, జ‌గ్గంపేట మండ‌లం, రాజ‌పూడిలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్య‌వ‌సాయం బోరుకు మ‌ర‌మ్మ‌తులు నిర్వహిస్తుండ‌గా.. కరెంటు తీగ‌లు పైపుల‌కు త‌గ‌ల‌డంతో ముగ్గ‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌ర‌ణించిన వారు బోదిరెడ్డి సూరిబాబు, కిల్ఇనాడు, గ‌ల్ల బాబిగా పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.