కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్నూలు (CLiC2NEWS): నగర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. రాయదుర్గం నుండి అనంతపురం వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంకు చెందిన రుద్ర, గణేశ్, సోమశేఖర్, కర్నూలుకు చెందిన రాజు, గోపి,జాఫర్‌లు అనంతపురానికి కారులో బయలుదేరారు. వారివాహనం ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వీరి ముందున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుద్ర, గణేశ్, సోమశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.