ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే సిబ్బంది అరెస్టు

భువనేశ్వర్ (CLiC2NEWS): ఒడిశా రైలు ప్రమాదం కేసులో సిబిఐ ముగ్గురు రైల్వే సిబ్బందిని అరెస్టు చేశారు. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో మూడురైళ్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి రాంగ్ సిగ్నలే కారణమని ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ () దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ రైల్వేశాఖకు చెందిన సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, మొహమ్మద్ ఆమిర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్లను ఆరెస్టు చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం తదిర అభియోగాలతో ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం.