ఉపనయన కార్యక్రమానికి వచ్చి.. కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు

నాగార్జునసాగర్ (CLiC2NEWS): ఉపనయన కార్యక్రమానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కృష్ణానదిలో గల్లంతయ్యారు. నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం నాగార్జున సాగర్ పైలాన్ శివాలయం పుష్కర్ ఘాట్ వద్ద ముగ్గురు వ్యక్తులు నదిలో స్నానమాచరించడానికి దిగారు. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 20 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహంలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకొనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని సహాయక చర్చలు చేపట్టారు.