యాదాద్రి జిల్లాలో కూలీలపైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గరు మృతి
ఆలేరు (CLiC2NEWS): యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొని , రోడ్డు పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రహదారిపై కొంత సమయం ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాద స్థాలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మరణించిన వారు భువనగిరి మండలం రాయిగిరి వాసులుగా గుర్తించారు.