దీపాలు వెలిగించేందుకు వెళ్లి..

చెరువులో మునిగి ముగ్గ‌రు అక్కాచెల్లెళ్లు మృతి

తిరుప‌తి (CLiC2NEWS): పుత్తూరు వ‌డ‌మాల‌పేట‌లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వ‌డ‌మాల పేట మండ‌లం ఎస్‌బిఆర్‌పురం గ్రామంలో ఉండే ఆర్ఎంపి బాబు, విజ‌య‌శాంతి దంప‌తుల‌కు ముగ్గురు కుమార్తెలు. స్థానిక గూళూరు చెరువు క‌ట్ట‌పై ఉన్న పురాత‌న శివాల‌యానికి దీపారాధ‌న చేసేందుకు గురువారం సాయంత్రం వెళ్లారు. అక్క‌డ ఉన్న చెరువులో దీపాలు వ‌దిలేందుకు మెట్ల మార్గం ద్వారా కింద‌కి దిగుతుండ‌గా.. మెట్లు పాకుడు ప‌ట్టి ఉండ‌టంతో అంద‌రూ జారీ చెరువులో ప‌డిపోయారు. విజ‌య‌శాంతి క‌ళ్లెదుటే కుమార్తెలు నీటి మునిగిపోతుండ‌టంతో కేక‌లు వేసింది. స‌మీపంలో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. విజ‌య‌శాంతిని పైకి తీశారు. కానీ కుమార్తెలను కాపాడ‌లేక‌పోయారు. వారు నీటిలో మునిగిపోయారు. వారి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. క‌ళ్ల‌ముందే కుమార్తెలు విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌టంతో ఆ తల్లి క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. ఆ గ్రామ‌మంతా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.